logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ kv విశ్వనాథన్ కు న్యాయవాదులు ఘన సన్మానం.....

ఈ రోజు హిందూపురం కు వచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ kv విశ్వనాథన్ ను హిందూపురం న్యాయవాదులు కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జస్టిస్ విశ్వనాథన్ న్యాయవాదులతో ముచ్చటిస్తూ హిందూపురం లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు ఇందుకు కు న్యాయవాదులు హిందూపురం కోర్టులో ఉన్న ADM,PDM,(జూనియర్ సివిల్ జడ్జిల) గత కరోనా కాలం తరువాత నుండి హిందూపురం కోర్టులలో జడ్జిలు అప్పోయింట్అవుతున్న వారు తప్పనిసరి ట్రైనింగ్ వెళ్లి పోతున్నారని అందువల్ల పేద బడుగు బలహీన వర్గాల కక్షిదారులు ఇతర కక్షిదారులు,న్యాయవాదులు చాలా ఇబ్బందులు పడుతున్నారని హిందూపురం కోర్టు లో సుమారు 8000 వేల కేసులు ఉన్నాయని కోర్టు సరిగా పనిచేయక పోవడం వల్ల వారికి సత్వర న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ,ఇది విన్న జస్టిస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హై కోర్టు ఛీఫ్ జస్టిస్ కు మీ సమస్యలు తెలుపుతానని హామీ ఇచ్చారు , అలాగే జస్టిస్ హిందూపురం చుట్టూ పక్కల గల పుణ్య క్షేత్రలు వాటి ప్రాముఖ్యతలు గురించి అడిగి తెలుసుకున్నారు లేపాక్షి ఆలయం కు ఈ రోజు సందర్శించ తలిచారు అలాగే పవిత్ర విదురసత్తం. అశ్వర్థ నారాయణస్వామి ఆలయం , పావగడ శనీశ్వర స్వామి ఆలయం సందర్శనకు పోతానని తెలిపారు ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నూరప్ప,న్యాయవాదులు సత్యనారాయణ,ఇందాద్,శివశంకర్,రామిరెడ్డి,,సుదర్శన్ , కృష్ణమూర్తి, రవిచంద్ర ,సుధాకర్,అజేయ్,చంద్రశేఖర్,మహిళా న్యాయవాదులు రసూల్ బి,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు

0
0 views

Comment