logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని వాహనాల స్వాధీనం....

సోమందేపల్లి లో కార్డెన్ అండ్ సెర్చ్

-భారీగా పోలీసుల సోదాలు
-నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని వాహనాల స్వాధీనం.

-నేరాల నియంత్రణకు కఠిన చర్యలు. --- పెనుకొండ డిఎస్పి, సిఐ.

నేరాలను అరికట్టడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడం లక్ష్యంగా సోమందేపల్లి మండల కేంద్రంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్ర ప్రవహార్ లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని పలు కాలనీలలో సోదాలు చేపట్టారు.గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని వివరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రజలకు తెలియజేశారు.

0
0 views

Comment