భద్రాచలంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం*
*భద్రాచలంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం*
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామ నవమి, పట్టాభిషేకం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి పెళ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచి కళ్యాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తరువాత నిత్య కళ్యాణ మండపంలో స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలపడానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుల దంపతులు, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఈవో దామోదర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తలంబ్రాల కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు.