logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలి *జిల్లా కలెక్టర్ అంకిత్



తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ మార్చి 07:*(ఏఐఎంయూ మీడియా ప్రతినిధి)

*మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలి*
*జిల్లా కలెక్టర్ అంకిత్*
*జిల్లా కలెక్టరేట్లో ఘనంగా మహిళ అంతర్జాతీయ దినోత్సవం**
*ప్రతిభ కనబరిచిన మహిళలకు ఘన సత్కారం*

కొత్తగూడెం ,మార్చి07 ):మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా, తమలోని ప్రతిభను వెలికితీసి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం నందుగల మీటింగ్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదని, అది సామాజిక అవసరమని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా విద్యా, వైద్య, రాజకీయ, సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వాలంబన సాధించాలని ఆకాంక్షించారు.నేటి ఆధునిక కాలంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతూ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిళలు స్వయం ఉపాధి, విద్య, వైద్యం మరియు రాజకీయ రంగాల్లో చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ అధికారిని మాట్లాడుతూస్వర్ణలత లెనినా మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ, శిశు సంక్షేమం మరియు అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో మహిళా సాధికారత కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మహిళా కార్పొరేటర్లను, నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులను, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను మెమెంటో, శాలువా, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు శ్రీలత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లాస్థాయి మహిళా అధికారులు, జిల్లాలోని అంగనవాడి సిడిపివోలు , సూపర్వైజర్లు, టీచర్లు,డిసిపియు, సిడబ్ల్యసి, సిహెచ్ఎల్, మిషన్ శక్తి, డిఎచ్డ్యు, పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

33
1335 views

Comment