ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదింటి మహిళ వివాహానికి చేయూత
మెట్‌పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 08/03/2026:
మెట్‌పల్లి పట్టణంలోని రేగుంట 13వ వార్డు ఏరియాలో నివసిస్తున్న కొల్లూరి స్వప్న నిరుపేద కుటుంబానికి చెందినవారని తెలుసుకున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆమె వివాహానికి సహాయం అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది 76వ పేదింటి వివాహానికి చేయూతగా నిలిచింది. ఈ సందర్భంగా వధువు కొల్లూరి స్వప్నకు వివాహానికి అవసరమైన పట్టుచీరతో పాటు 120 మందికి సరిపడా భోజన సామగ్రి అందజేశారు. ట్రస్ట్ సభ్యులు అందించిన ఈ సహాయంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని స్థానికులు అభినందించారు.