logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ 5కే రన్ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*



నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ 5కే రన్ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

- *అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ జేఎన్‌టీయూ మరియు మై భారత్ అనంతపురం, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న “నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ – 5కే రన్ (Say No to Drugs)” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు.*

- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువతలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించడం మరియు నషా ముక్త్ అభియాన్ లక్ష్యాలను ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడం కోసం ఈ 5కే రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రన్ ఈ నెల 8వ తేదీ (ఆదివారం) ఉదయం టవర్ క్లాక్ వద్ద ప్రారంభమై, సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జ్, సంగమేశ్వర సర్కిల్, కలెక్టరేట్ మీదుగా జేఎన్‌టీయూ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు..ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 11,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 7,000, తృతీయ బహుమతి 5,000 మరియు అదనంగా 5 మందికి 3,000 రూపాయల చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత అనంతపురం – డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.*

- *ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ జి.మమతా, మై భారత్ ప్రతినిధి బిసాతి భరత్, మై భారత్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జి.శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాతి జీవన్ కుమార్, కే. జయ మారుతి, అలాగే వాలంటీర్లు శేషాద్రి, అంబరీష్ బాబు పాల్గొన్నారు.*

5
253 views

Comment