అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమన్వయంతో ఘనంగా నిర్వహించాలి*
*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమన్వయంతో ఘనంగా నిర్వహించాలి*
- *ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2026ను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐసిడిఎస్, డిఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులకు పలు సూచనలను జిల్లా కలెక్టర్ జారీ చేశారు.*
- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఎ, మెప్మా సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు*
- *అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని జేఎన్టీయూలోని ఎన్టీఆర్ స్టేడియంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, డి ఆర్ డి ఎ, మెప్మా తదితర అన్ని ఇతర శాఖల విభాగాలతో కలిసి జిల్లా స్థాయిలో మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తోందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళలకు మహిళా సాధికారత, లింగ వివక్ష నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన తదితర రంగాలలో ప్రతిభ సాధించిన వారికి గౌరవ అతిథులు మరియు ముఖ్య అతిథుల ద్వారా సత్కరించడం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలను ఫలవంతంగా నిర్వహించాలని, ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.*
- *ఈ కార్యక్రమంలో భాగంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా చెక్కు పంపిణీ చేయడం జరుగుతుందని డిఆర్డీఏ పిడి శైలజ తెలిపారు. బ్యాంకు లింకేజీ కింద 1301 కోట్ల రూపాయలను, స్త్రీనిధి రుణాలు కింద 240 కోట్ల రూపాయలు, ఉన్నతి పథకం కింద సుమారు 13 కోట్లు, పి.ఎం అజయ్ కింద 2.50 కోట్ల రూపాయల చెక్కులను, మహిళా రైతు సంఘాలకు ట్రాక్టర్ల పంపిణీ జిల్లా కలెక్టర్, ముఖ్య అతిథుల చేత పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.*