logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సమయపాలన పాటించాలి.. భోజనం నాణ్యతగా ఉండాలి*పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి*



*సమయపాలన పాటించాలి.. భోజనం నాణ్యతగా ఉండాలి*

- *: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి*

- *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

- *: నగరంలోని గుత్తి రోడ్డులోనున్న అన్నక్యాంటీన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*

- *: అన్నక్యాంటీన్ సేవలపై ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు*

అనంతపురం, మార్చి 07 :

- *అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులోనున్న (నీరుగంటివీధి) అన్నక్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తనిఖీ చేశారు. శనివారం ఉదయం అన్నక్యాంటీన్ ను తనిఖీ సేవలపై ప్రజలతో, అక్కడ పనిచేసే సిబ్బందితో నేరుగా మాట్లాడి జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతగా భోజనం అందిస్తున్నారా, సమయపాలన ఎలా ఉంది, వేళకు తీస్తున్నారా, తదితర వివరాలు ఆరా తీశారు. అన్నక్యాంటీన్ సేవలు బాగున్నాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌంటర్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.*

- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వ్యాలీడ్ మొబైల్ నంబర్ లు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఉండాలని, దాని ద్వారా ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందన్నారు. వ్యాలీడ్ మొబైల్ నంబర్ లు ఇచ్చేలా అవగాహన కోసం ప్రాంగణంలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అన్నక్యాంటీన్ సమయపాలన పాటించాలని, భోజనం బాగా నాణ్యతగా ఉండాలన్నారు.*

- *ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, డిఈ సత్యనారాయణ, ఎంహెచ్ఓ నరసింహులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, శానిటేషన్ సిబ్బంది, అన్నక్యాంటీన్ లీగల్ అడ్వైజరి టీం, తదితరులు పాల్గొన్నారు.*

0
102 views

Comment