పసలూరు గ్రామంలో ఆర్డీఎస్ఎస్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
*పసలూరు గ్రామంలో ఆర్డీఎస్ఎస్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
- *బుక్కరాయసముద్రం మండలంలోని పసలూరు గ్రామంలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పరిశీలించారు. శనివారం పసలూరులో జిల్లా కలెక్టర్ గ్రామస్థులతో మాట్లాడి ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా వారికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలు (Poles) మరియు డిటిఆర్ లను ఏర్పాటు చేసే సమయంలో ఏపీఎస్పీడిసిఎల్ అధికారులకు సహకరించాలని గ్రామస్థులకు సూచించారు. అదేవిధంగా పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా వినియోగదారులకు కలిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించారు. శిర్డీసాయి ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య తేదీకి అనుగుణంగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి అదనంగా కనీసం 90 బృందాలను (batches) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.*
- *ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడిసిఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.వి.రమేష్ మరియు శ్రీకాంత్ రెడ్డి, ఏఈ మహబూబ్ భాష, తదితరులు పాల్గొన్నారు.*
- *అంతకుముందు బుక్కరాయసముద్రం మండలంలోని రేకులకుంట గ్రామంలో అంగన్ వాడి కేంద్రంను, ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడి కేంద్రంలో వయసుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా లేదా అని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మంచి భోదన అందజేయాలన్నారు.*