logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ*...

*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ*అనంతపురం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. హై షుగర్ సమస్యతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న మోహన్ కి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయంగా చెక్కును అందించారు. అలాగే మెడ క్రింద భాగంలో నరాల సమస్యతో బాధపడుతున్న హలిపీరకి, అపెండిక్స్ సమస్యతో చికిత్స పొందిన పార్వతికి, అలాగే శస్త్రచికిత్స చేయించుకున్న వణితకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎంపీ అందజేశారు.*

- *ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు అవసరమైన సమయంలో వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని వారు తెలిపారు.*

0
87 views

Comment