చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన పెద్ద ఆడిటోరియంను పరిశీలించారు.
- అనంతపురం నగరంలోని మహిళా బాలల గ్రంథాలయం మరియు ఆడిటోరియంను శనివారం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కార్యదర్శి పి.కమ్మన్నతో కలిసి సందర్శించారు. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన పెద్ద ఆడిటోరియంను పరిశీలించారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ భవనం విద్యార్థులకు మరింత ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
- ఈ సందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2 మరియు సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఎంపీ లాడ్స్ నిధులు మరియు ఇతర నిధుల ద్వారా కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రంథాలయాన్ని సందర్శించిన పాఠకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు, సిబ్బంది మరియు పాఠకులు పాల్గొన్నారు.