శ్మాశానాలు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తాం సాకే హరి
శ్మాశానాలు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తాం సాకే హరి
చనిపోయిన వారిని పూడ్చడానికి శ్మాశానాలు లేకపోవడంతో పోరాటాలు చేయాల్సి రావడం సిగ్గుచేటని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు.గురువారం కళ్యాణదుర్గం పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్,పాదర్ విన్సెంట్ పెర్రర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ప్రతి గ్రామంలోనూ శ్మాశాన వాటికలు ఏర్పాటు చేయాలని జీపు యాత్రను సాకే హరి ప్రారంభించారు. సమాజంలో అంటరానితనం,కులవ్యక్షత, దోపిడీ,పీడనలు దళిత,గిరిజనులను వెంటాడుతుంటే చస్తే పూడ్చుడానికి శ్మాశానాలు లేకపోవడంతో చాల ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో శవాలను ఇళ్ల ముందు ఉంచుకొని బాధపడిన సందర్భాలు అనేకమన్నారు.శ్మాశాన వాటికల సమస్యలు పరిష్కరించాలని ఎన్నోదపాలుగా అధికారులు నాయకులు దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడం బాధాకరమన్నారు. శవాలను ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉంచుకొని ఆందోళన చేసినప్పట్టికి స్పందించకపోవడం అన్యాయమన్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్మాశాన వాటికల సాధన జీపు యాత్ర కొనసాగుతోందని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంగా కలసి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ కళ్యాణదుర్గం ఇంచార్జ్ చెలిమప్ప,మల్లి పల్లి మధు,కంబుదూరు మండల అధ్యక్షులు కూరాకుల పల్లి గోపాల్,వంటా రెడ్డి పల్లి నాగరాజు,సిర్పి గంగప్ప,కుందుర్పి జాకీ, మారుతి ప్రసాద్, యాటకాలు తిప్పేస్వామి,ఎర్రబోరేపల్లి నరసింహులు,హరి బాబు, నాగేంద్ర,నరసింహులు,సతీష,డ్రైవర్ సురేష్,శ్రీరాములు,రామాంజనేయులు,ప్రభాకర్ దితరులు పాల్గొన్నారు.