logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎం.ఎస్.రాజు, తిప్పేస్వామి భేటీ....*


*ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎం.ఎస్.రాజు, తిప్పేస్వామి భేటీ....*
మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మరియు శ్రీసత్యసాయిజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని అసెంబ్లీలో గురువారం ఉదయం కలిశారు. మడకశిర నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎం.ఎస్.రాజు, తిప్పేస్వామి వివరించారు. వాటితో పాటు నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 20నెలల కూటమి పాలనలో మడకశిరలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీసత్యసాయిజిల్లా మరియు మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తలు, అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలన్నింటిపై సీఎంకు పూర్తివివరాలు అందించారు. మడకశిర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సానుకూల స్పందనపై ఎం.ఎస్.రాజు, తిప్పేస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.
*(మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మరియు శ్రీసత్యసాయిజిల్లా టీడీపీ అధ్యక్షులు వారి కార్యాలయం నుండి జారీ......)*

0
46 views

Comment