దివ్యాంగులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం
దివ్యాంగులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు గుర్తింపు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కొప్పల వసుంధర పేర్కొన్నారు. శుక్రవారం జేఎన్టీయూలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురం తో దివ్యాంగుల అభివృద్ధి కోసం తమ కార్యక్రమాలు అనంతపురంలో కొనసాగించడానికి అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు.ఈ క్రమంలో ఈనెల 15 నుంచి 14 వరకు స్థానిక ఆర్డిటి స్కూల్, బుక్కరాయసముద్రంలో గల ఉచిత వ్యాపార శిక్షణ కార్యక్రమం ఇగ్నైట్ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం కోసం 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఐదు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో 50 మంది దివ్యాంగులకు అవకాశం ఇస్తున్నామని ఇప్పటికే 25 మంది ఎంపిక చేశామని గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగులకు ఈ విషయాన్ని చేరవేయడానికి ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అటల్ ఇంకుబేషన్ సెంటర్ ఎస్కేయూ, సేర్ప్ డిఆర్డిఏ అనంతపురం దివ్యాంగుల సంక్షేమ శాఖ, కెనరా బ్యాంకు, ఆర్డిటి, ఏకత్వ ఫౌండేషన్ సహకార అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ అనంతరం దివ్యాంగులకు బ్యాంకు రుణాలో వారు కంపెనీలకు ఆఫీసు స్పేస్ వారికి కావలసిన మెంటరింగ్ టెక్నాలజీ సపోర్టు డిపిఆర్ సపోర్టు మొదలైన దాదాపు పది లక్షల విలువైన సర్వీసులు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.