దిశా” (జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ) సమావేశమునకు ఉమ్మడి అనంతపురము
ఈ రోజు న ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారి పర్యటన / కార్యక్రమ వివరములు:-
1) స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న డి.పి.ఆర్.సి.సమావేశభవనం నందు అనంతపురము పార్లమెంట్ సభ్యుల అధ్యక్షతన జరిగిన “దిశా” (జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ) సమావేశమునకు ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై అజెండా మేరకు సమీక్ష నిర్వహించారు, చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, ఉపాధిహామీ పనుల యందు అవకతవకలు జరగకుండా, తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఎవరికైనా అత్యవసమైతే 108 సర్వీసుకోసం కాల్ చేస్తే, అంబులెన్స్ లు వచ్చేసరికి పరిస్థితి విషమించి ప్రాణాలు పోతున్నాయని, భవిష్యత్ లో ఇలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిపోయిందని, దీనిపై సంభందిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురము జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి జిల్లాలో ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్.డి.టి సంస్థకు యఫ్.సి.ఆర్.ఎ ని రెన్యువల్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్జి.ల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి శివ శంకర్ పలు శాఖలజిల్లా స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.