logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శిథిలావస్థకు చేరిన తుంగభద్ర హై లెవెల్ మెయిన్ కెనాల్ ను ఆధునికరించండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్.

శిథిలావస్థకు చేరిన తుంగభద్ర హై లెవెల్ మెయిన్ కెనాల్ ను ఆధునికరించండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్.
స్థానిక : - గుంతకల్లు బీటీ పకీరప్ప భవన్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ మాట్లాడుతూ
* తుంగభద్ర జలాశయం నుండి అనంతపురం జిల్లాకు 32.5 టిఎంసిల నీరు రావాల్సి ఉంది 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీరు ఇవ్వాల్సి ఉంది హై లెవెల్ మెయిన్ కెనాల్ హెచ్ ఎల్ ఎం సి శిథిలావస్థకు చేరింది కాలువల స్ట్రక్చర్లు డిస్ట్రిబ్యూటరీస్ పిల్ల కాలువలు పూర్తిగా దెబ్బతిని, తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా తయారైనాయని కర్ణాటక నుండి అనంతపురం జిల్లా సరిహద్దు వరకు 4వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటే 105 కిలోమీటర్ జిల్లా నుండి కాలువలో 2వేల క్యూసెక్కులు వదిలితే కాలువకు గండ్లు పడి నీరు వృధా అవుతు రంద్రాల్లోనికి పోతుంది.
* *ఈ అద్వానమైన పరిస్థితులు వల్ల మన జిల్లాకు 24 టీఎంసీ లు కూడా రావడం లేదు వస్తున్న నీటి లో తాగునీటి అవసరాలకే 11 టీఎంసీలు తుంగభద్ర నీరు ఇవ్వాల్సి ఉంది ఇలాంటి పరిస్థితులలో జిల్లాలో 70వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పంట పొలాల్లోకి ఇస్తున్నారు ఈ సాగునీరు కూడా పంటలకు అదును తప్పి ఇస్తున్నారు చివరి ఆయకట్టు పొలాల్లోకి తుంగభద్ర నీరు పోవడం లేదు.
* *ఈ దుస్థితి వల్ల తాడిపత్రి ఆయకట్టుకి 31 వేల ఎకరాలకు ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా 14 ఎకరాలకు గుంతకల్లు సబ్ బ్రాంచ్ కెనాల్ నుండి 16వేల ఎకరాలకు తుంగభద్ర నీరు ఇవ్వడం లేదు. అతుకులు బొంత మాదిరిగా కృష్ణ బెసిన్ లోని నీరు అడపాదడపా ఇస్తున్నారు.
* * రాయదుర్గం తాలూకాలో ఉంతకల్లు రిజర్వాయర్ను నిర్మించి హైలైవెల్ కెనాల్ ద్వారా 5 టీఎంసీల నీరు నిల్వ చేయాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని సర్వేకు గాను 3 కోట్ల 70 లక్షలు కావాలి. ఇంత వరకు నిధులు ఇవ్వలేదు సర్వేను జరగలేదు.
* *హై లెవెల్ మెయిన్ కెనాల్ అదినీకరణ చేయుటకు 453 కోట్లతో 6 ప్యాకేజీలు టెండర్లు కూడా పిలిచినారు. ప్రభుత్వం నిధులు ఇవ్వనందువలన గుత్తేదారులు పనులు చేయలేదు.
*105 కిలోమీటర్ల నుండి 189 కిలోమీటర్ల వరకు హెచ్ఎల్ఎంసీ ని అధునీకరణ చేయాలి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఇద్దరు కలిసి పాదయాత్ర కూడా చేశారు కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా తుంగభద్ర హెచ్ఎల్ఎంసి కెనాల్ ఆధునికరణను విస్మరించినారు.
*కావునా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి మండలాల యందు రైతుల సదస్సు జరిపి చైతన్యపరిచి ఆ మండలాల నుంచి రైతులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాటాలకు సన్నద్ధమైతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్ర స్వామి , ఏఐటియూసి జిల్లా మహేష్,పట్టణ సహాయ గౌస్ ,మండల కార్యదర్శి రాము, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మురళీకృష్ణ, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు.టి.సురేష్ పట్టణ సిపిఐ నాయకులు దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

4
47 views

Comment