logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోడ్డు ప్రమాదంలో గోపాలమిత్ర మృతి..

రోడ్డు ప్రమాదంలో గోపాలమిత్ర మృతి..
▪️భౌతికాకాయానికి నివాళి అర్పించి, బంధువులను పరామర్శించిన రాప్తాడు మాజి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి
రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామానికి చెందిన గోపాలమిత్రగా పని చేస్తున్న గొరవ శివయ్య ప్రమాదవశాత్తూ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాప్తాడు మాజి ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ ‌రెడ్డి శుక్రవారం అనంతపురం సర్వజన ఆస్పత్రిలోని మార్చురీ గదికి చేరుకుని గొరవ శివయ్య భౌతికాకాయాన్ని పరిశీలించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన ఘటన గురించి శివయ్య సోదరుడు రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మంచి సేవలందిస్తూ బాగా పేరు తెచ్చుకున్న శివయ్య ఇలా అకాలమరణం పొందడం బాధాకరమని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. ప్రకాష్‌ రెడ్డి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు

3
68 views

Comment