ఆర్.డి.టి సంస్థ యొక్క "యాఫ్.సి.ఆర్.ఏ" ను రెన్యువల్ చేయాలి
*ఆర్.డి.టి సంస్థ యొక్క "యాఫ్.సి.ఆర్.ఏ" ను రెన్యువల్ చేయాలని బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణములో ర్యాలీ మరియు తపాలా శాఖ కార్యాలయం ను ముట్టడి చేసిన బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ...*
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రములో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ మరియు అతని బృందం నేడు పెనుకొండ తహశీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ ,దర్గా సర్కిల్, యాస్ కే డి సర్కిల్ తెలుగుతల్లి సర్కిల్, యన్ టి ఆర్ సర్కిల్ మీదగా పెనుకొండ పట్టణంలోని కేంద్ర ప్రభుత్వo ఆధ్వర్యములో నడిచే తపాలా శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నీ చేపట్టడం జరిగినది.అనంతరం బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యములో పెనుకొండ పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయం ను ముట్టడి చేయడం జరిగినది.
ఈ కార్యక్రమన్నీ ఉద్దేశించి శివరామకృష్ణ మాట్లాడుతూ "ఆర్ డి టి FCRA ను రెన్యువల్ చేయాలని,లేని పక్షములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరియు వాటి కార్యాలయాల ముట్టడి ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తాము అని,అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్డిటి సేవలు చాలా ఉపయోగకరము అని ,సేవలకు ఆటంకం కలిగించడం చాలా దారుణం అని తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాస్ గాని పల్లి కుళ్లాయప్ప, చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజ, గౌరవ సలహాదారులు మునుమడుగు నరసింహులు, రాయలసీమ ఉపాధ్యక్షుడు చల్లపల్లి ఈశ్వర్, కోశాధికారి రాంపురం రామాంజనేయులు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు గట్టు రామాంజనేయులు, మరియు. తరిమెల సూరి, నరేష్, పోతున్న, హనుమంతు, రామాంజ జిల్లా యూత్ అధ్యక్షుడు పెనుగొండ శశి, ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రంగేపల్లి కదిరిప్ప, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ విఆర్ఓ గోవిందప్ప, గోరంట్ల మండలం కమ్మవారి పల్లి నరసింహులు,నాగరాజ్., పరిగి మండలం రాందాస్ ,సురేష్, మూర్తి హనుమంతప్పసోమందేపల్లి మండలం మూర్తి, కుమార్, భాష, బుల్సముద్రం కుమార్, రుద్ర, కొండపల్లి రంగనాథ్, పెనుగొండ ఎస్సీ కాలనీ యూత్, తదితరులు పాల్గొన్నారు.