మద్యం మత్తులో తండ్రి కత్తి విసురు…
11 ఏళ్ల బాలికకు తీవ్ర గాయం
📍 చిత్తూరు జిల్లా
నారగల్లు పంచాయతీ కొత్తకోట హెచ్‌డబ్ల్యూ కాలనీలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన దారుణ చర్యతో బాలికకు తీవ్ర గాయం జరిగిన సంఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తకోట హెచ్‌డబ్ల్యూ కాలనీకి చెందిన పయని అనే వ్యక్తి తరచూ మద్యం సేవించి తన భార్య, పిల్లలను తిడుతూ కొడుతుండేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో నిన్న రాత్రి సుమారు 8.00 గంటల సమయంలో, తన కూతురు సుస్మితను తిడుతూ “చంపేస్తాను” అంటూ ఆగ్రహంతో ఇంట్లో ఉన్న **మచ్చుకత్తి (కొంకి కత్తి)**ను విసిరాడు.
అప్పుడు అక్కడే తన కూతురుతో కలిసి చదువుకుంటున్న అదే కాలనీకి చెందిన అక్షయ (11) అనే బాలికకు ఆ కత్తి తగిలి ఎడమ కాలుకు తీవ్రమైన రక్తగాయం అయింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను చిత్తూరులోని అమ్మా హాస్పిటల్ కు తరలించగా ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై బాలిక అక్షయ అమ్మమ్మ సరస ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు పయనిను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
ఈ ఘటనతో కాలనీలో ఆందోళన నెలకొంది.