logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్ ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్ లను ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణల్లో క్లియర్

07.03.2026(హైదరాబాద్ )

హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్ ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్ లను ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణల్లో క్లియర్ చేశారు.పారదర్శకంగా వేగవంతమైన సేవల కోసం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ పోర్టల్ ను
నేడు డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ మంత్రి పొంగులేటి ప్రారంభించారు.అంతే కాదు హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్ కూడా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.,ప్రజలకు వేగవంతమైన పారదర్శక సేవలను అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దృష్టి సారించిందని .. వారి ఆలోచనలకు అనుగుణంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోని కార్యక్రమాలను అధికారులు విజయవంతం చేసేందుకు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
హౌసింగ్ బోర్డు పరిధిలో ఇండ్లు, ప్లాట్లు, స్థలాలను వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసి వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోయిన 5 వేల మందికి అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.కేటాయింపుదారులు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోర్టల్ లోనే తమ రిజిస్ట్రేషన్ లు, చెల్లింపుల ధృవీకరణ, ఇతర లావాదేవీలను పర్యవేక్షించవచ్చు అన్నారు . ఇది హౌసింగ్ బోర్డు, అలాటీల మధ్య నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.

సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని భరోసా ఇచ్చారు.

26
7495 views

Comment