logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం.. నిరుపేదలకు శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా

అనకాపల్లి: రోలుగుంటలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అనకాపల్లి కో-ఆపరేటివ్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రోలుగుంట ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న కో-ఆపరేటివ్ భవనంలో ఈ శిబిరం నిర్వహించనున్నారు.ఈ శిబిరంలో కంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. శుక్లాల (కటారాక్ట్) సమస్యతో బాధపడుతున్న నిరుపేదలను ఎంపిక చేసి, ఉచిత శస్త్రచికిత్స అందిస్తారు. అర్హులైనవారికి ఆరోగ్యశ్రీ, ఈ హెచ్ ఎస్, ఏపీ ఈపీడీసీఎల్, ఈసీహెచ్ఎస్ పథకాల ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుతాయి. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలు, ఈ అవకాశాన్ని పొందుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ శిబిరం ద్వారా అనేక మంది కంటి దృష్టిని తిరిగి పొందే అవకాశం ఉంది. స్థానికులు భుజర్ష్యలు ఈ కార్యక్రమంలో చేరి, ప్రయోజనం పొందాలని కోరారు

0
66 views

Comment