logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*వ్యాపార సంస్థల సంఘాలు స్వచ్ఛందంగా సిసిటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి.*

*పత్రికా ప్రకటన*
అదిలాబాద్ జిల్లా,
మార్చ్ 7 :-


*సురక్షితమైన ఆదిలాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.*

*పట్టణం పూర్తిగా సీసీటీవీ నిఘా లో ఉండేలా ఏర్పాటు కృషి.*

*నేరాలు లేని ఆదిలాబాద్ ఏర్పాటు కృషి*

*దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు జరగకుండా మరియు జరిగిన వాటిని కనుగొనేందుకు సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం.*

*సమిష్టి కృషితో అభివృద్ధి, రక్షిత, భద్రత కలిగిన ఆదిలాబాద్ సాధ్యం.*

*ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులచే సమావేశం.*

*పాల్గొన్న 27 వ్యాపార సముదాయాల సంఘాలు.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*

ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత సురక్షితంగా, నేరాల రహితంగా మార్చేందుకు సిసిటీవీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులచే పోలీసు ఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పట్టణంలోని వివిధ వ్యాపార సముదాయాలకు చెందిన 27 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సురక్షితమైన ఆదిలాబాద్ నిర్మాణంలో వ్యాపార వర్గాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యాపార సంస్థ, దుకాణం, మార్కెట్ ప్రాంతాల్లో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను ముందుగానే నిరోధించడమే కాకుండా, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణాన్ని పూర్తిగా సిసిటీవీ నిఘా పరిధిలోకి తీసుకురావడం లక్ష్యం అని తెలిపారు. ఇందుకు పోలీసు శాఖతో తాము స్వచ్ఛందంగా, ఇష్ట ప్రకారం వ్యాపార సంస్థలు, ప్రజలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు వంటి సంఘటనలను అరికట్టడంలో సిసిటీవీ కెమెరాల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, వీధులు, కాలనీలలో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల పట్టణం మొత్తం నిరంతర నిఘాలో ఉండి ప్రజలకు భద్రత పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా వ్యాపార సంస్థల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో సిసిటీవీ కెమెరాల ఏర్పాటు చేపట్టాలని, వాటిని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడానికి సహకరించాలని సూచించారు. సమిష్టి కృషి, పరస్పర సహకారంతో అభివృద్ధి చెందిన, రక్షితమైన, భద్రత కలిగిన ఆదిలాబాద్ పట్టణాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కర్రె స్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్ మటోలియా, ప్రతినిధులు, పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాల నాయకులు, రిజర్వాయిన్స్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment