logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఖమ్మం భూదాన్ కమిటీ ముసుగులో నిరుపేదల నుంచి 3 కోట్ల రూపాయలు వసూళ్ళు చేసిన ముఠా సభ్యుల్లో 9 మంది అరెస్ట్ *ఖమ్మం పోలీస్ కమిషనరేట్,

తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మార్చి 07
(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
***************************


*యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ ముసుగులో నిరుపేదల నుంచి 3 కోట్ల రూపాయలు వసూళ్ళు చేసిన ముఠా*

*నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులుగా గుర్తించిన భూదాన్ యజ్ఞ బోర్డు స్టాండర్డ్ కౌన్సిల్*

*వెలుగుమట్ల భూ వివాదంకు సంబంధించి ఇప్పటికి 19 కేసులు నమోదు. తొమ్మిది మంది అరెస్ట్*

*భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంది*

యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారంతో వెలుగుమట్ల నిరుపేద బాధితుల నుంచి 3 కోట్ల రూపాయలు వసూళ్ళు చేసిమోసం చేశారని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాదరావు తెలిపారు.

భూదాన్ యజ్ఞ బోర్డు
లెర్నీడ్ స్టాండింగ్ కౌన్సిల్ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులుగా వెలుగు చూశాయని తెలిపారు.

ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

ఆయా కేసుల్లోని నిందితులంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి తాము ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేసుకొని
అమాయక ప్రజలను ప్రేరేపించి, వారికి ఆశపెట్టి, భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తామని నిరుపేద భాదితుల ఒక్కొ క్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు చేశారని చెప్పారు. నిందితులు చర్యలవల్ల అనేక మంది పేదలు నిలువునా మోసపోయారని, భూదాన్ కాలనీ సభ్యుల నుంచి వసూల్ చేసిన డబ్బును వారి స్వప్రయోజనాలకు వాడుకుని, ప్రశ్నించిన వారికి భూదాన్ పట్టాలు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని నమ్మబలికారని ఆయన పేర్కోన్నారు. ఈ ముఠా సభ్యులపై గతంలో సుమారు15 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు క్షేత్రస్థాయిలో కొనసాగుతోందని, ఎవరైనా బాధితులు మోస పోయినట్లయితే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని , బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుండి రికవరీ చేసి తిరిగి భాదితులకు అప్పగిస్తామని అన్నారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్ కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

*అరెస్ట్ అయిన నిందుతులు*

1) కొప్పెర వెంకన్న 42 సం,, నామవరం(వి), మోతె(ఎం),       సూర్యాపేట

2)కొట్టే బసు, 39 సం,, వెలుగుమట్ల ఖమ్మం. ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామం

3) సంపంగి వెంకటాచలం 43 సం,, గోపాలపురం ఖానపురం

4) బల్లి శ్రీనివాసరావు, 45సం, వినోభా నవోదయ కాలనీ బుర్దా రాఘవపురం ఏన్కూరు మండలం 

5)తాళ్లూరి కృష్ణ 50 సం,, కవిరాజునగర్, వినోభా నవోదయ కాలనీ, వెలుగుమట్ల, ఖమ్మం.

6)ముదిగ @ బుడిగె రాములు వెలుగుమట్ల ఖమ్మం అర్బన్

7)మంకిడి లింగరాజు @ ఇంకిడి లింగ రాజు 66సం,, లచ్చగూడెం (v), ఏన్కూరు మండలం, ప్రస్తుతం వినోభా నవోదయ కాలనీ, వెలుగుమట్ల, ఖమ్మం.

8)రాచకొండ నరసింహా చారి @ చారి సహకారనగర్, భూదాన్ కాలనీ, వెలుగుమట్ల, ఖమ్మం

9)దండా లింగయ్య 50సం,,బోసు బొమ్మ సెంటర్ ఖమ్మం

123
3525 views

Comment