logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అదిలాబాద్ జిల్లా మావల మండలం ​కొమురం భీం కాలనీలో మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా


దినోత్సవ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
ఈ సందర్భంగా
గోడం రేణుక జిల్లా అధ్యక్షురాలు,, ఉయిక ఇందిర, జిల్లా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ

, మహిళలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ, సమానత్వం మరియు స్వయం పరిపాలన హక్కులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అయితే నేటికీ మహిళలపై అణచివేత, వరకట్నపూ హత్యలు, భ్రూణ హత్యలు మరియు గృహహింస రాజ్య హింస కిరోసిన్ యాసిడ్ దాడులు అనేక సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దిశ లాంటి చట్టాలు ఎన్ని ఉన్నా మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి
​ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తడానికి మరియు మహిళా సాధికారతను చాటిచెప్పడానికి ఏర్పాటు చేసిన ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ప్రజలు ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, కార్మిక కర్షక వర్గాలు విద్యార్థిని విద్యార్థులు ఆదివాసీలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
గోడం రేణుక జిల్లా అధ్యక్షురాలు

ఉయిక ఇందిర జిల్లా ఉపాధ్యక్షురాలు

వేడామ మనుకుబయి
మండల ఉపాధ్యక్షులు
మడావి అనసూయ
సంయుక్త కార్యదర్శి
చాహకటి అనసూయ
ప్రచార కార్యదర్శి
మడవి కమల బాయి
ఆత్రం పారుబాయి
ఉయిక తూర్పు బాయి
సోయం సావిత్ర భాయి
కుముర చంపు బాయి తదితరులు పాల్గొన్నారు

1
0 views

Comment