logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంగా చదవి ఉన్నతంగా స్థిరపడాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా*

పత్రికా ప్రకటన
మార్చి 7, 2026_ఆదిలాబాదు:



విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్‌గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల కళాశాలలో RBSK (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం) ఉట్నూర్-బి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగిస్తూ.. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడమే ఈ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్‌ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లి సరైన చికిత్స పొందాలని వివరించారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి పదవతరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్ లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, కష్టపడి కాకుండా ఇష్టంతో చదవి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాలన్నారు.

అనంతరం కిచెన్, స్టోర్ రూమ్ లను తనిఖీ చేసి రిజిస్టర్లలో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, అదనపు వైద్యారోగ్య అధికారి మనోహర్, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్పెషలిస్ట్ వైద్యుల బృందం, తదితరులు పాల్గొన్నారు.

0
13 views

Comment