తిరుపాడు గ్రామానికి స్వచ్ఛ రథం వాహనం.
గడివేముల (AIMA MEDIA ): పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో కూటమి ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన స్వచ్ఛ రథం కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని పొడి చెత్తను (ప్లాస్టిక్, ఇనుము, కాగితం) సేకరించి, దానికి బదులుగా నిత్యావసర వస్తువులను అందించే ఒక వినూత్న "వ్యర్థాల నుంచి సంపద" (Waste to Wealth)విధానం. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడం ప్రధాన లక్ష్యాలు.
*స్వచ్ఛ రథం యొక్క ముఖ్య అంశాలు:*
• బాటర్ విధానం: ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న పొడి చెత్తను ఇచ్చి, నిత్యావసరాలు (వస్తువులు) పొందుతారు• ప్రతి మండలానికి ఒక రథం: ప్రతి మండలానికి ఒక ప్రత్యేక వాహనాన్ని (రథం) ఏర్పాటు చేసి, వారానికి ఒకసారి గ్రామాలను సందర్శిస్తారు.వ్యర్థాల నిర్వహణ: సేకరించిన ప్లాస్టిక్, ఇనుము, కాగితం వంటి వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి సంపదగా మారుస్తారు.ఈ కార్యక్రమాన్ని గత కొన్ని నెలల క్రితం గుంటూరు జిల్లా వెంగళాయపాలెం నుండి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు, మరియు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా ప్లాస్టిక్ రహిత గ్రామాలు, రోడ్లపై చెత్త లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బివిఎన్ రాజు, (ఐటీడీపి గడివేముల మండలం అధ్యక్షులు) పాల్గొని గ్రామ ప్రజలందరు పంచాయతీ రాజ్ శాఖ వారు అమలు చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్లాస్టిక్, ఇనుము, కాగితం, అట్టలు వంటి పాత వస్తువులను మార్చుకుని ప్రయోజనం పొంది అలాగే గ్రామాన్ని స్వచ్ఛ గ్రామం గా మార్చుకోవాలని అన్నారు.