logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్

హైదరాబాద్
07/03/2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి కి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ డెలావర్ గవర్నర్ కి 'తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్ , వేం నరేందర్ రెడ్డి , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

23
7236 views

Comment