పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం వివిధ కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం అబీద్ సెంటర్ కూడలి వద్ద మానవహారం ఏర్పరచి మహిళా దినోత్సవం గురించి నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గఫూర్, రేవతమ్మల ఆధ్వర్యంలో జరిగింది. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళల సాధికారత, సమానత్వం, రక్షణ అంశాలపై దృష్టి సారించారు. "మహిళలు సమాజంలో అమూల్యమైన భాగస్వాములు. వారి హక్కులు, భద్రత కోసం పోలీస్ శాఖ తప్పకుండా నిలబడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు మహిళల అవగాహనను పెంచుతాయి" అని అన్నారు. విద్యార్థులు, పోలీసులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలు విజయవంతం చేశారు.