logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇరిగెల బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు ఆళ్లగడ్డలో జనసేన పార్టీ తాలూకా స్థాయి సమావేశం

AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై రేపు (ఆదివారం, మార్చి 8వ తేదీన) ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 9:30 ఈ భేటీ జరుగుతుందని ఆళ్లగడ్డ తాలూకా వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదును సమర్థవంతంగా నిర్వహించడం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఉద్యమి సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మరియు జనసేన నాయకులు కొణిదెల సునీల్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. కావున ఈ సమావేశానికి తాలూకాలోని జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగెల విశ్వనాథరెడ్డి, సుధాకర్ రెడ్డి , జున్ను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

239
7783 views

Comment