ఖమ్మం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రత్యేక అంధుల స్కూల్ నిర్మాణ పురోగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం
07/03/2026
ఖమ్మం జెడ్పీ సెంటర్ లోని నిజాంపేట్ ప్రభుత్వ
ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక అంధుల స్కూల్ నిర్మాణ పురోగతి పనులను జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల ప్రతి భాగాన్ని పరిశీలించి భవన నిర్మాణ నాణ్యత, ప్రహారీ గోడ, గేట్, ప్రవేశ మార్గాలు, అంతర్గత గదుల రూపకల్పన, గ్రీనరీ, మొక్కలు, టైల్స్, ప్రత్యేకంగా టాయిలెట్స్, తరగతి గదులు, నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాట్లు, మ్యుజికల్ రూం, విద్య సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అంధుల పిల్లల చదువులకోసం వారి తల్లిదండ్రులు ప్రజావాణిలో అర్జీలు ఇచ్చినప్పుడు ఒక ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తకు కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటుకు కార్యచరణ చేపట్టి నేడు పూర్తి దశలలో ఉన్న పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంధుల బ్రెయిలీ లిపి కోసం ప్రత్యేకమైక డిజిటల్ అడియో డివైజర్ ద్వారా అంధ విద్యార్థి ఉపయోగించే విధానం ప్రత్యక్షంగా పరిశీలించారు. మిగిలిన పనులను వేగవంతం చేసి అత్యుత్తమ నాణ్యతతో పూర్తి చేయాలని, విద్యార్థులు పాఠశాలలో ప్రవేశించిన క్షణం నుంచి బయటికి వెళ్లే వరకు పూర్తిస్థాయి భద్రత, సౌలభ్యం లభించేలా నిర్మాణంలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలని అధికారులను కలెక్టర్
ఆదేశించారు.