logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం: భక్తుల కోలాహలం

జర్నలిస్ట్: ఆకుల గణేష్

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం శుక్రవారం రాత్రి 8 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. స్వామివారు గుట్టపై నుంచి నీలాదేవి, భూదేవి సమేతంగా వచ్చి పూజలు అందుకున్నారు. అనంతరం సతీసమేతంగా రథంపై ఆసీనులైన స్వామివారిని గుట్ట చుట్టూ ఊరేగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందారు.

2
808 views

Comment