logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శిల్పా క‌ళా వేదిక‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్.. *ఈ ప్ర‌భుత్వం మీది.. ,


తెలంగాణ స్టేట్ న్యూస్, మార్చి 06:::(ఏఐఎంఎ మీడియా న్యూస్ ప్రతినిధి)
*********************************
శిల్పా క‌ళా వేదిక‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..

*ఈ ప్ర‌భుత్వం మీది.. ,

మీరంతా కోరుకుంటే , ప్ర‌జా పాల‌న రావాలి, ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రావాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష‌తో 2023 ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు..


2023 లో మా ద‌గ్గ‌ర అధికార యంత్రాంగం, అక్ర‌మ సంపాద‌న లేదు..

అక్ర‌మ కేసులు, అక్ర‌మ సంపాద‌న‌తో ఆధిప‌త్యాన్ని చెలాయిస్తున్న వారు ఒక వైపు, చ‌చ్చినా స‌రే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చిత్త‌శుద్ది తో మేం చేసిన ప్ర‌య‌త్నం మ‌రో వైపు..

మాట‌లు, మూట‌ల‌తో అయితే మేం ఎన్నిక‌ల్లో గెలిచేవాళ్లం కాదు..

చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోంది..

పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి..

ఎలా అయితే సాధించుకోవాల‌న్న త‌ప‌న‌తో కొంద‌రు ప్రాణ త్యాగాలు చేశారు..

ఎన్నో చిక్కుముడులు, క‌మిష‌న్లు,త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి..

20 ఏళ్ల నుంచి ఈ స‌మ‌స్య‌ను ప్ర‌త్య‌క్షంగా నేను చూస్తూ వ‌స్తున్నాను..

మీరు కోట్లాడిన ప్ర‌తి సంద‌ర్భంలో నా చేత‌నైనా సాయం చేస్తూ వ‌చ్చాను..

క్రిష్ణ మాదిగ‌, స‌తీష్ మాదిగ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు చేత‌నైన సాయం చేసి అండ‌గా నిలిచాను..

అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఆ నాటి పాల‌కులు సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, సంప‌త్ కుమార్ తో పాటు న‌న్ను బ‌య‌ట‌కు గెంటివేశారు..

నాకు మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడు అనే పాత్ర‌లు ఇష్టం..

కర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు పోరాటం చేశారు.. మిత్ర‌ధ‌ర్మాన్ని నేర‌వేర్చాడు..

నేను కూడా మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించాను.. మాదిగ‌ల‌కు నేను అండ‌గా నిల‌బ‌డ్డాను

ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బ‌ల‌హీనుల ప‌ట్ల నిల‌బ‌డి కొట్లాడ‌టం అనే గొప్ప ల‌క్ష‌ణం ఉన్న‌వాడు..

వ‌ర్గీక‌ర‌ణ లో న్యాయం ఉంది.. మీరు బ‌ల‌హీనులు కాబ‌ట్టే నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డాను..

రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిడి వ‌చ్చినా మాదిగ‌ల ప‌క్క‌న నిల‌బ‌డ్డాను..

నా ప్ర‌య‌త్నంలో మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు, అధికారులు స‌మ‌య‌స్పూర్తిని చూపించి అండ‌గా నిల‌బ‌డ్డారు..

సుప్రీంకోర్టు ఆదేశాల త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ‌ను అమ‌లు చేసిన మొద‌టి రాష్ట్రం మ‌న‌దే..

వ‌ర్గీక‌ర‌ణ అన్ని స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం చూపించ‌క‌పోచ్చు..

ప్ర‌మోష‌న్లు, ఉన్న‌త విద్య‌, భూములు , లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం పెద్ద విష‌యం కాదు..

ముందుండి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ప్పుడు వెనుక నుంచి జ‌రిగే దాడుల‌ను మీరు ఆపాలి..

వెన‌క నుంచి జ‌రిగే దాడుల విష‌యంలో మీ జాతి నాకు అండ‌గా ఉండాలి..

నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండి స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి..

ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడ‌ర్లు నా ప్ర‌భుత్వ ఉద్యోగులే..

99 రోజుల ప్ర‌జా పాల‌న‌.. ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నాం..

ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నాం..

ప్ర‌తిపేద వాడికి రేష‌న్ కార్డు అందాలంటే మీరు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి..

స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి కోసం పేద‌లు ఎదురు చూస్తున్నారు..

అత్యంత వెనుక‌బాటు త‌నంలో మాదిగ జాతి ఉంది.. ప్ర‌భుత్వ. ఉద్యోగులు వాళ్ల‌కు అండ‌గా ఉండాలి..

సంక్షేమం, అభివృద్ధి ని అందించాల‌న్న‌దే మా సంకల్పం..

ప్ర‌తి నెల 1000 మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.. నెల‌కు 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వ‌స్తోంది.. అయినా స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నాం..

ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే బాధ్య‌త ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ది..

అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ఖ‌జానా కు నిధులు తీసుకువ‌స్తే ప‌ది మందికి స‌హాయం అందుతుంది..

గ‌తంలో జాగీరుదారులు, జ‌మీందార్ల ద‌గ్గ‌ర వేలాది ఎక‌రాల భూములు ఉండేవి..

అసైన్డ్ భూముల విష‌యంలో ప్ర‌భుత్వం అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది..

పంచ‌డానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భూములు లేవు..

ప్ర‌భుత్వానికి ఆర్థిక వెసులుబాటు ప‌రిమితం గా ఉంది..

దారిద్ర్య రేఖ లో ఉన్న జాతి ముందుకు న‌డ‌వాలంటే విద్య అవ‌స‌రం..

నా ద‌గ్గ‌ర ఉన్న విద్యా శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నాను.. నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం..

ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం..

విద్య ఒక్క‌టే మీ జీవితంలో మార్పు తీసుకువ‌స్తుంది..

అవ‌కాశం వ‌స్తే ప‌ది మందికి సాయం చేస్తార‌నే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి..

మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం..మీ హ‌క్కుల‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేసి కాపాడుతాం..

చ‌ట్ట‌బ‌ద్ద‌మైన హ‌క్కుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మీది..

గ‌త ప్ర‌భుత్వం బర్రెలు, గొర్రెలు, చేప‌లు ఇచ్చింది..చెప్పులు కుట్టుకొమ్మ‌ని చెప్పింది..

బ‌ర్రెలు,గొర్రెలు , చేప‌లు కాదు.. చెప్పుకుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి.. క‌లెక్ట‌ర్లు, డాక్ట‌ర్లు, ఇంజనీర్లు, లాయ‌ర్లు కావాలి..

తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి..

నా శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు మీకు సాయం చేస్తాను..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ ఎలా ప‌నిచేశారో అలాంటి స్పూర్తితో ప‌నిచేస్తా..

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేసిన‌ప్పుడు రేవంత్ మాదిగ‌, బీసీలు రేవంత్ యాద‌వ్, వాకిటి శ్రీహ‌రి కి మంత్రి ప‌ద‌వి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కులు స‌ర్దార్ రేవంత్ అని అస‌దుద్దీన్ కు సాయం చేశాన‌ని రేవంతుద్దీన్ అని న‌న్ను అన్నారు..


ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అంద‌రి వాడిని..

సీఎంగా వ‌చ్చిన అవ‌కాశాన్ని ప‌ది మంది కి స‌హాయం చేయ‌డానికే అని భావిస్తున్న‌..

వ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని మీ జాతికి చేయూత ఇచ్చిన‌ప్పుడే నాకు నిజ‌మైన సంతోషం క‌ల్గుతుంది..

21
1108 views

Comment