logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించుకుందాం..మంత్రి పొంగులేటి..

6/03/2026
మహబూబబ్

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించుకుందాం అని మంత్రి పొంగులేటి కోరారు

అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని,నేడు మహబూబాబాద్ ఐడీఓసీలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో సహచరమంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని దిశానిర్దేశనం చేయడం జరిగింది.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు .

ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపనను, సాకారం చేసే బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరిపై ఉందిని,ప్రభుత్వ కార్యక్రమాలను అమలుపరచడంలో ప్రతి అధికారి పూర్తి అంకిత భావంతో తమ పరిధిలోని పనులు చేపట్టాలిని,గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

విద్యా మరియు వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలిచేలా తయారు కావాలని, అందుకు ప్రభుత్వం తరపున కావాల్సిన మద్ధతు తప్పకుండా అందుతుందని,
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాల స్థానంలో నూతనంగా నిర్మించడం లేదా ప్రత్యామ్నాయ చర్యలను అధికారులు పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని సూచించారు.
బాలికల పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు, ఇన్సులేటర్స్ మొదటి ప్రాధన్యత కింద ఏర్పాటు చేయాలని,అధికారులు విద్యార్థుల సంక్షేమ హాస్టళ్ల బాధ్యతను భుజాన వేసుకోవాలని,వారంలో కనీసం ఒక్కరోజు హాస్టల్లో బస చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు.
ఈ శాఖలలో ఎదురవుతున్న సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని,మార్చి నెలాఖరు వరకు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలి. అనర్హులకు ఇండ్లు ఇస్తే కలెక్టర్లు భాద్యులు అవుతారని హెచ్చరించారు.

అదే విధంగా గిరిజనులు తమ పాకల స్థానంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టకూడదని,
రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు కలిసికట్టుగా సర్వే చేసి. భూముల సరిహద్దులను నిర్ణయించుకోవాని,అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టకూడదు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పాస్ బుక్కులు, సాదా బైనామాలు, ఇతర ఏ పనులు కూడా పెండింగ్ ఉండడానికి వీలు అన్నారు.

సహజ వ్యవసాయాన్నీ ప్రోత్సహించేలా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల వినియోగం తగ్గించేలా, అందుకోసం కావాల్సిన ప్రణాళికలను రూపొందించిన 99 రోజుల కార్యక్రమాల్లో భాగం చేసి, రైతులను క్షేత్ర స్థాయిలో చైతన్యపరచాలి.దెబ్బతిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి.
అర్బన్ ప్రాంతాల్లో మహిళా సంఘాల సంఖ్య పెంచడమే కాకుండా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు పథకాల ద్వారా చేకూరాల్సిన లబ్ధి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.వేసవిలో పల్లె, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలి. ప్రాధాన్యం ఆధారంగా ఒక్కో సమస్యను పరిష్కరించడం జరుగుతుంది.

12 తేదీన జరిగే స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని నూతన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేయాలి.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కేవలం ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం కాదు, అధికారులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ మంచి పనులను ప్రజలకు చేరువ చేసినప్పుడే అసలైన విజయం సాకారం అవుతుందని మంత్రి పోగులేటి గారు తెలిపారు.

1
10689 views

Comment