ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన ఉన్న జామాయిల్ మొక్కలు ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన ఉన్న జామాయిల్ మొక్కలు ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించి జామాయిల్ చెట్లు పూర్తిగా దగ్ధమవుతున్నాయి.
ఘటన సమాచారం అందుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ఇళ్ల సముదాయం ఉండటంతో అధికారులు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఘటన జరిగిన సమయంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండటంతో మంటలు మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. స్థానిక సమాచారం ప్రకారం సమీపంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో భారీగా టపాకాయలు పేల్చడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.