logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం *మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పనిని కార్మికులకి అందని ద్రాక్ష లా దూరం చేస్తున్నది, *బత్తుల వెంకటేశ్వర్లు,

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మార్చి 06:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం

*మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పనిని కార్మికులకి అందని ద్రాక్ష లా దూరం చేస్తున్నది,

*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు

బూర్గంపాడు, మార్చి 06:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)మండల పరిధిలోని ఎస్టి కాలనీ శ్రీ రాంపురం ప్రాంతంలో ఉపాధి పని చేస్తున్న కార్మికుల్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు శుక్రవారం నాడు సందర్శించారు.ఈ సందర్భంగా పనిచేస్తున్న ఉపాధి కార్మికుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు వారు ఆవేదనతో ఇప్పుడు ఈ పని చేయలేమని అంటున్నారు గతంలో లాగానే ఉపాధి పని చేయించాలి అని చెబుతున్నారు.వారి బాధ వినలేని పరిస్థితి ఉదయం 6:30 కు పోతే మధ్యాహ్నం రెండు గంటల దాకా ఎర్రటి ఎండలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని అపని ప్రాంతంలో టెంట్లు లేవని మేము తీసుకెళ్లిన మంచినీళ్లు ఎండకి బాటిల్స్ లో నీళ్లు సలసల వేడి ఎక్కి ఉండటం వల్ల ఆ నీళ్లు మేము తాగితే చెప్పకూడదు కానీ మూత్రం కూడా రాని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు.రెండు ఫోటోలు తీయాలoట ప్రతి మనిషి ఒక్కొక్క మనిషికి రెండుసార్లు ఫోటోలు వారి కంటి చూపు యాప్ లో పడాలంట అట్టా పడని పక్షంలో ఉపాధి కార్మికులు అక్కడే ఉండాలి. ఏ ఒక్కరికైనా కంటిచూపు సక్రమంగా ఫోటోలు రాకపోతే అందరికీ మాస్టర్లు కట్టు. అంతేకాదు కూలీ 150 నుండి 100 పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలు ఆవేదనతో తెలిపిన విషయాలపై స్పందించిన బత్తుల మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధి పనిని పూర్తిగా తీసేయాలని కుట్రలో భాగంగా ఇవన్నీ చేపిస్తున్నారని ఉపాధి కార్మికులు వారంతట వారే పనికి రాకుండా మానేయాలని దురుద్దేశం తోటి ఇవన్నీ పెడుతున్నారని అన్నారు.గ్రామ పంచాయతీలకు ఉపాధి పనిని కేటాయించే పరిస్థితి ఇప్పుడు లేదని డైరెక్టుగా కేంద్రం నుండే యాప్ ద్వారా ఉపాధి పనిని చూపిస్తారంట గతంలో కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్రాలకు ఉపాధి పనికి ఖర్చు పెట్టాలని చట్టంలో చెబుతుంది 90% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చట్టంలో చెబుతుంది కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరాంచాల ని 40 శాతం కూడా ఖర్చు పెడితేనే కేంద్రం నుండి 60 శాతం ఇస్తామని చెబుతున్న మోడీ సర్కార్ 40% ఖర్చు పెట్టకపోతే రాష్ట్రాలకు పూర్తిగా జీరో కేంద్రం నుంచి ఉంటుందని ఆ రకంగా ఈ పనిని పూర్తిగా ఉపాధి కార్మికులకి లేకుండ ఆదాని ,అంబానీ వారు ఇద్దరికే ఉపాధి నిధులు కూడా కట్టబెట్టే కుట్రతో బాగానే ఉపాధి పనిని ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి కార్మికులపై భారం మోపుతున్నారు.
టీవీ చానల్లో సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వం 125 రోజులు పని కల్పిస్తామని చెబుతుంది కానీ నిధులు కేటాయించ కుండా మోసం దగా చేస్తూ బడ్జెట్లో నిధులు లేకుండా రాష్ట్రాలకి ఇవ్వకుండా మీరు 125 రోజులు పని ఎక్కడ చూపిస్తారు పనిచేసిన వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈమాత్రం కూడా ఆలోచన లేని ప్రభుత్వాలు ఉపాధి కార్మికులపై భారాలు మోపుతున్నారని సరైంది కాదని, వెంటనే ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని గతంలో ఉన్న విధంగానే ఉపాధి పనిని నడిపించాలని డిమాండ్ చేస్తున్నా అని పత్రికా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత, సురేష్, సక్రు, బేబీ, సుభద్ర ,తార, మంగు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు

91
2589 views

Comment