హుకుంపేట: ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ
అల్లూరి జిల్లా, హుకుంపేట మండలం, ములియాపుట్టు పంచాయతీలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జోగులపుట్టు గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసు పుస్తకాలను ఆర్డీఓ లోకేశ్వర రావు లబ్ధిదారులకు అందజేశారు. రీ-సర్వే అనంతరం ప్రభుత్వ రాజముద్రతో 41 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.