డుంబ్రిగుడ: గంజాయి జోలికి పోవద్దు..
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం, సాగర పంచాయితీ అడపవలస గ్రామంలో శుక్రవారం సే నో టూ గంజా పై పోలీసులు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని అన్నారు. సైబర్ మోసగాళ్ళు పంపె లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. డ్రంక్ & డ్రైవ్, ట్రిపుల్, స్పీడ్ రైడ్ చేయకూడదని రహదారి భద్రత పై ఎస్ఐ అవగాహణ కల్పించారు. స్ధానిక వార్డ్ మెంబర్ రమేష్ పాల్గొన్నారు.