శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సు మరియు మానవకార రోబోటిక్స్ పై వర్క్ షాపు.
పాణ్యం (AIMA MEDIA): శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థులకు మార్చి 6 మరియు 7వ తేదీలలో "ది ఫ్యూచర్ అఫ్ ఇంటెలిజెంట్ మెషిన్స్: ఏఐ మరియు హ్యూమనయిడ్ బోటిక్స్ "అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎడ్యుబోటిక్స్ సంస్థకు చెందిన మిస్టర్ కె సందీప్ (బిజినెస్ మేనేజర్) మరియు రియాజ్ షేక్ హాజరయ్యారు.. మొదటిరోజు వీరు విద్యార్థులను ఉద్దేశించి రోబోట్ ప్రోగ్రామింగ్, పైథాన్ ద్వారా రోబోట్ నియంత్రణ మరియు రోబోటిక్స్ లో ఏఐ వినియోగంపై శిక్షణ ఇచ్చారు, అలాగే భవిష్యత్తు అవకాశాల గురుంచి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.రమాదేవి మాట్లాడుతూ ఇలాంటి వర్క్ షాప్ లు విద్యార్థులకు పరిశ్రమలో అవసరమైన ప్రాక్టికల్ జ్ఞానం అందించడంలో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమానికి డేటా సైన్స్ విభాగానికి చెందిన ఫ్యాకల్టీ హాజరయ్యారు..