logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వికె కోల్ మైన్ బొగ్గు ఉత్పత్తిని సింగరేణి కార్మికులు తోనే తియ్యాలి గుర్తింపు సంఘం ఎఐటియుసి డిమాండ్



సత్తుపల్లి డిప్యుటేషన్ కార్మికులను వెంటనే వీ కే కోల్ మైన్ లో నియమించాలి

కొత్తగూడెం మార్చి 6:ఏరియా బ్రాంచ్ సెక్రెటరీ మల్లికార్జున్ రావు కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్ సారధ్యంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు ను కలిసి జీకే ఓ సి నుండి జెవిఆర్ఓసికి డిప్యూటేషన్ పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వికె సీఎం లో నియమించాలని కోల్ క్రషర్స్ బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బందితోనే నడిపించాలని వి కే సి ఎం కు సరి అయిన సిబ్బంది ఇన్ఫ్రాస్ట్రక్షన్స్ ని సమకూర్చాలని డిమాండ్ చేస్తూ జనరల్ మేనేజర్ షాలెం రాజు కు మెమోరాండం అందించిన కొత్తగూడెం ఏరియా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు.
కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ మూసివేసిన తరువాత కొత్తగూడెం ఏరియా నుండి వివిధ ఏరియాలకు అలాగే సత్తుపల్లి ఏరియాకు డిప్యూటేషన్ మీద పంపినటువంటి కార్మికులందరినీ కూడా తిరిగి వెంటనే వీ కే సీ ఎం లో నియమించాలని కోరారు. వికే సి ఎం ప్రైవేటీకరణ చేసినట్లయితే కొత్తగూడెం లో కార్మికుల సంఖ్య తగ్గిపోతే కొత్తగూడెం ఏరియా లో ప్రజానీకం వ్యాపారవర్గం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనుగడ లేకుండా పోతుంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలో డిప్యుటేషన్ మీద వెళ్ళిన కార్మికులను తిరిగి వికేసిఎంలో నియమించి కొత్తగూడెం ఏరియా ను కాపాడాలని ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాములు, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ హుమాయిన్, వికే సి ఎం పిట్ సెక్రటరీ ఎంఆర్కె ప్రసాద్, ఏరియా స్టోర్స్ పిట్ సెక్రెటరీ కమల్, వర్క్ షాప్ పిట్ సెక్రటరీ మధు కృష్ణ, రాజేశ్వరరావు, సాంబమూర్తి, బండారి మల్లయ్య, రమణ, సురేష్, సాయి పవన్ రవి పాల్గొన్నారు.

126
3997 views

Comment