logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

800 రోజుల్లో చేయలేనిది 99 రోజుల్లో చేస్తారా..? ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలకే దిక్కులేదు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

800 రోజుల్లో చేయలేనిది 99 రోజుల్లో చేస్తారా..?

ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలకే దిక్కులేదు

రైతు భరోసా ఎక్కడ..?

కొత్తగూడెం 800 రోజుల్లో చేయలేనిది ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల్లో సాధించగలరా అని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పేరు మార్చి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. షాపుల్లో దొరకాల్సిన యూరియాను యాపుల్లో పెట్టారని, ఆ యాప్ లో కూడా యూరియా దొరకక రైతులు రైతు వేదిక చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి హడావిడి సృష్టించడం తప్ప ఒక్క పని పూర్తి చేసిన పాపాన పోలేదని చెప్పారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలేదని, రూ.2వేల నుంచి 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ ఊసేత్తడం లేదని విమర్శలు గుప్పించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని వాగ్దానం ఇచ్చి వారికి నేటికి ఇస్తానన్న రూ.2500 కూడా ఇవ్వలేదని అన్నారు. చదువుకుంటున్న యువతులకు స్కూటీలు ఎక్కడా..?, అలాగే నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువవికాసం పేరిట అప్లికేషన్లు స్వీకరించి మూలన పడేశారని పేర్కొన్నారు. ఏడాది లోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని తెలిపారు. దాంతో ఈరోజు భద్రాద్రి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కి నిరసన చేపట్టిన దాఖలాలు కళ్ళముందు కట్టినట్టు కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కొత్తగూడెం మున్సిపల్ కార్మికులకు అందాల్సిన అలవెన్స్ లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

85
4319 views

Comment