శివరామిరెడ్డి పై జరిగిన హత్యాయత్నానికి ఖండించిన SDPI అధ్యక్షుడు ముక్తార్ భాష
నంద్యాల జిల్లా : SDPI ఆళ్లగడ్డ అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు ముక్తార్ భాష మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కత్తులతో దాడి చేయడంతో వైయస్సార్సీపి ఆళ్లగడ్డ నాయకులు శివరామిరెడ్డి తీవ్రంగా గాయపడటం అత్యంత దురదృష్టకరమని రాజకీయ విభేదాలను హింస రూపంలో వ్యక్తపరచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి దాడులు సమాజంలో భయాందోళనలు సృష్టిస్తాయని, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ దాడి ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని SDPI ఆళ్లగడ్డ అసెంబ్లీ కమిటీ డిమాండ్ చేసింది. అలాగే బాధితుడు శివరామిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జాఫర్ భాషా, అసెంబ్లీ కార్యదర్శి ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.