ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ. నందు ఐ.టి.ఐ. పాసైన అభ్యర్థులకు వివిధ కంపెనీలలో అప్రెంటిస్ షిప్ శిక్షణ అవకాశాలు,
*ఆర్ ఐ టి ఐ కృష్ణ సాగర్ ప్రిన్సిపాల్ ధర్మచారి,
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా***బూర్గంపాడు/భద్రాచలం 06 మార్చి 26,(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
**********************************
ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ. నందు ఐ.టి.ఐ. పాసైన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ శిక్షణ అవకాశాలు,
*ఆర్ ఐ టి ఐ (కృష్ణ సాగర్) ప్రిన్సిపాల్ ధర్మచారి,
భద్రాచలం/బూర్గంపాడు, మార్చి 06:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ. భద్రాచలం ( కృష్ణసాగర్) నందు ఐ.టి.ఐ. పాసైన అభ్యర్థులకు వివిధ పరిశ్రమలో అప్రెంటిస్ షిప్ శిక్షణ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా (PMNAM) నిర్వహించ బడుననీ ఆర్ ఐ టి ఐ కృష్ణ సాగర్ ప్రిన్సిపాల్ ధర్మచారి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ యొక్క అప్రెంటిషిప్ మేళ కార్యక్రమానికి T.K.I.L. Industries Ltd., చర్లపల్లి, మరియు Bharath Electronics Ltd., నాచారం కంపెనీ ప్రతినిధులు హాజరు కానున్నారనీ ఆయన అన్నారు.
ఇందు నిమిత్తం ఐ.టి.ఐ. పాసైన అభ్యర్ధులు ముందుగా www.apprenticeshipindia.in నందు వారి పేరు నమోదు చేసుకొని నకలు కాపీని ఒక బయోడేటా ఫాం ను మరియు తమ సంబంధిత విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా జత చేసి Apprenticeship మేళాకు హాజరు కావలెనని ఆయన తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం. జిల్లా లోని ప్రభుత్వ/ప్రైవేటు ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ మరియు పరిశ్రమల యాజమన్యులు తమ పరిధిలోని Apprenticeship ఖాళీల వివరాలతో 09-03-2026 నాడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ. భద్రాచలం (కృష్ణసాగర్) నందు తప్పనిసరిగా హాజారుకావలనీ ఆయన కోరారు.