భారతదేశంలో ఏడాదికి 33 వేల కోట్ల రూపాయలతో 65 లక్షల లబ్ధిదారులకి పింఛన్ ఇస్తున్న* ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే..ఎమ్మెల్యే కూన రవికుమార్
*భారతదేశంలో ఏడాదికి 33 వేల కోట్ల రూపాయలతో 65* *లక్షల లబ్ధిదారులకి పింఛన్ అధిక* *మొత్తంలో ఇస్తున్న* *ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే...* *ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు*
✅బడ్జెట్‌పై సంపూర్ణ మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు
✅అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రజాహిత బడ్జెట్ – కూన రవికుమార్ గారు
✅ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా ఆమదాలవలస గౌరవ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (PUC) చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులపై విశ్లేషణాత్మకంగా మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతోషపరుస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రూపొందించబడిందని పేర్కొన్నారు.
✅ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన ఈ బడ్జెట్ నిజమైన ప్రజాహిత బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు.
✅అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూన రవికుమార్ అన్నారు. సంవత్సరానికి సుమారు రూ.33 వేల కోట్ల వ్యయంతో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ఆయన గర్వంగా తెలిపారు.
✅ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
✅ప్రజల ఆశయాలకు అనుగుణంగా రూపొందిన ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారికి కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూన రవికుమార్ తెలిపారు.
*#apassembly*
*#budgetdiscussions*
*#mlamadalavalasa*
*#koonaravikumar*
*#naralokesh*
*#pavankalyan*
*#narachandrababunaidu*