logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎంజీయూలో పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రిజిస్ట్రార్‌కు వినతిపత్రం-BRSV

నల్గొండ: 06/02/26 మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజి రెడ్డి గారికి వినతిపత్రాన్ని ఎంజీ యూనివర్సిటీ బీఆర్ఎస్వి అధ్యక్షులు వాడపల్లి నవీన్ అందజేశారు.ఈ సందర్భంగా వాడపల్లి నవీన్ మాట్లాడుతూ,గత రెండు సంవత్సరాలుగా పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధనాభిలాషులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా NET, SET, JRF అర్హతలు సాధించిన విద్యార్థులు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.అర్హతలు సాధించినప్పటికీ యూనివర్సిటీ నోటిఫికేషన్ లేకపోవడంతో వారు తమ పరిశోధన ప్రయాణాన్ని ప్రారంభించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలు ఇప్పటికే పీహెచ్‌డీ నోటిఫికేషన్లు విడుదల చేసి అడ్మిషన్లు చేపడుతున్నాయని, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరలో పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.విద్యార్థుల ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు ఆలస్యం కాకుండా ఉండేలా యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి యూనివర్సిటీ నాయకులు సిద్దు, అరుణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

31
1488 views

Comment