కూలిపోయిన సుఖోయ్ ఫైటర్ జెట్
కూలిపోయిన సుఖోయ్ ఫైటర్ జెట్
గల్లంతైన వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం కుప్పకూలింది. విషయాన్ని ఐఏఎఫ్ ధ్రువీకరించింది. అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం పైలట్ కోసం గాలిస్తున్నారు. శిక్షణ సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సఖోయ్ రాడార్ నుంచి అదృశ్యమైంది. ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిందని అధికారులు పేర్కొన్నారు.