మోస్సాద్ ఆపరేషన్ - బడేసబా క్యాలెండర
మోస్సాద్ ఆపరేషన్ - బడేసబా క్యాలెండర్!
ఆయుతోల్లా అలీ ఖోమెనీ ని హత్య చేయడానికి మోస్సాద్ తన ఆపరేషన్ ని 2020లో మొదలుపెట్టి 2026 లో పూర్తి చేసింది!
మోస్సాద్ చాలా ఓపికగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వచ్చింది. ఖోమెనీ కి వ్యతిరేకులు ఎవరో లిస్ట్ తయారుచేసింది. ముందు డాలర్లు (?) ఇచ్చి మచ్చిక చేసుకుంది. మొబైల్ apps ఏవి ఎక్కువగా ఇష్టంగా వాడుతున్నారో తెలుసుకుంది.
ఇరాన్ లో పర్షియన్ భాష లో రోజూ నమాజు చేసే సమయాలు రంజాన్ లాంటి పర్వదినాలలో ప్రత్యేక ప్రవచనాలని ఖురాన్ నుండి తీసుకుని వాటిని మెసేజ్ రూపంలో పంపించే మొబైల్ apps చాలానే ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ లో.
BadeSaba calendar పేరుతో మొబైల్ app ని 50 లక్షల ఇరాన్ ప్రజలు వాడుతున్నారని తెలుసుకుంది. బడేసబ app ని హ్యాక్ చేసింది కానీ ఎవరికీ తెలియదు
బడేసబ కాలెండర్ app షియా ముస్లిమ్స్ కోసం పర్షియన్ భాషలో రూపొందించబడింది. ఇస్లామిక్ (హిజ్రి )క్యాలెండర్ అది. రోజుకి అయిదు సార్లు నమాజ్ చేసే ఫజ్ర్, dhuhr, asr, magharib, ఇష సమయాలని గుర్తు చేస్తూ పుష్ నోటిఫికెషన్స్ ని పంపుతుంది చిన్న అలారం సౌండ్ తో నమాజు(ఆదాన్) చేయండి అని సూచిస్తూ!
మత పెద్దలు మరణించిన రోజుని, ఇతర మతపరమైన పండుగలని గుర్తు చేస్తూ నోటిఫికేషన్లు పంపుతుంది!
ఇరాన్ లోని ట్రాఫిక్ నెట్ వర్క్ నిజానికి చాలా కాలం నుండి మోస్సాద్ అధీనంలో ఉంది! అవసరమైనప్పుడు ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ లో ఎక్కడ తనకి లైవ్ వీడియో అవసరమో అక్కడి లైవ్ ఫుటేజ్ ని వాడుకుంటూ వస్తున్నది మోస్సాద్!
సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఇదే బడేసబ క్యాలెండర్ app ని గూగుల్ ప్లే స్టోర్ లో కాకుండా APK ఫైల్ రూపంలో ఇతర థర్డ్ పార్టీ ప్లాట్ ఫార్మ్స్ అయిన APKPURE, SOFTONIC, CAFE BAZAR లాంటి చోట్ల కూడా లభ్యమవుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుండి కాకుండా ఎవరైనా థర్డ్ పార్టీ ప్లాట్ఫార్మ్స్ నుండి APK ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుతుంటే దానిని గుర్తించి హ్యాకర్స్ ముందు ఆ మొబైల్ నుండి నెట్వర్క్ లోకి దూరిపోయి హ్యాక్ చేస్తారు.
1998 నుండి ఇజ్రాయేల్ హ్యాకర్స్ చురుకుగా ఉంటూ వస్తున్నారు కాబట్టి మోస్సాద్ కి హకింగ్ అనేది వెన్నతో పెట్టిన విద్య అయింది.
Wired Middle East కధనం ప్రకారం…
ఫిబ్రవరి 28 శనివారం ఉదయం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండే సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్న లైవ్ దృశ్యాలని చూస్తున్న మోస్సాద్ కి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతోల్లా అలీ ఖోమెనీ ని కలవడానికి వెళ్తున్న హై పొజిషన్ లో ఉన్న ఖోమెనీ నమ్మినబంట్లు ప్రయాణిస్తున్న కార్లు కనపడ్డాయి. అమెరికా, ఇజ్రాయేల్ దాడులు మొదలైయ్యే సమయం కాబట్టి ఖోమెనీ తో అత్యవసర సమావేశం కోసమే వెళ్తున్నారు!
అప్పటికే ఇరాన్ లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయి ఉండడం వలన కేవలం text మెసేజీ లు మాత్రమే మొబైల్ ఫోన్లకి వస్తున్నాయి తప్పితే వీడియో, ఫోటోలు రావడం ఆగిపోయాయి. IRGC సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్టర్నెట్ ఎందుకు స్లో అయిందో పరిశీలన చేయగా అంతా బాగానే ఉంది కానీ ఎందుకు స్లో అయిందో గుర్తించలేకపోయారు!
శనివారం ఉదయం 10:08 నిముషాలకి ఇరాన్ లో బడే సబ app వాడుతున్న అందరికీ ఒక పుష్ నోటిఫికేషన్ వచ్చింది ఇలా “ Help Arrived ”.
Help Arrived అనే నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఆయుతోల్లా ఖోమెనీ నివాసం మీద ఎయిర్ to సర్ఫెస్ మిసైల్స్ దాడి చేసి భవనం పూర్తిగా కుప్పకూలిపోయేలా చేసాయి.
ఖోమెనీ మరణించినట్లు నిర్ధారించుకున్న తరువాత మరో పుష్ నోటిఫికేషన్ 10:14 నిముషాలకి వచ్చింది దాని సారాంశం ఇలా ఉంది…
“ఇరాన్ ప్రజలని క్రూరంగా హింసించి హత్య చేసిన ప్రభుత్వం మీద పగ తీర్చుకునే సమయం వచ్చేసింది.ఇప్పటికే మీ దగ్గర ఆయుధాలు ఏవన్నా ఉంటే వాటిని వదిలేసి వచ్చి IRGC మీద పోరాడడానికి మాతో వస్తే మీకు క్షమాభిక్ష పెడతాము”
Help Arrived అనే మెసేజ్ వచ్చిన సమయానికి అమెరికన్, ఇజ్రాయేల్ ఫైటర్ జెట్స్ టెహ్రాన్ నగరం బయట గగనతలంలో ఎగురుతున్నాయి. ఖోమెనీ తన భవనంలోనే ఉన్నాడు అని నిర్ధారణ చేసుకున్న మరు క్షణమే మిసైల్స్ ప్రయోగించడం, అదే సమయంలో మొబైల్ ఫోన్ల కి మెసేజ్లు పంపింంచడం ఒకే సారి జరిగిపోయాయి!
IRGC లో మోస్సాద్ కి ఎజెంట్స్ ఉన్నారన్నది పాత విషయమే! ఖోమెనీ తన నివాసంలో ముఖ్యలతో ఉన్నాడని ఖోమెనీ నివాసంలోని వాళ్లలో ఎవరో సమాచారం ఇచ్చారు. సదరు సమాచారం ఇచ్చిన వ్యక్తి మీసైల్ దాడిలో చనిపోయి ఉంటాడు!
ఇప్పటికీ ఇరాన్ లో ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు!
****************
షహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలు, పంజాబ్ రైతు ఉద్యమం పేరుతో రోడ్లు మూసివేసి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి కాల్పులు జరిపేలా చేసి కాల్పుల్లో చనిపోయిన వారిని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసని ప్రేరేపించి మోడీజీ ని రాజీనామా చేయమని డిమాండ్ చేయాలానే ప్లాన్ ని జాగ్రత్తగా డీల్ చేశారు!అది జార్జ్ సోరోస్ మార్క్ ప్రభుత్వాలని కూలదోసె ప్రణాళిక!
అదే తరహాలో ప్రజలని రెచ్చగొట్టి ఇరాన్ ప్రభుత్వ దళాల చేతిలో అమాయక ప్రజలు చనిపోయేలా చేసి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడే ఖోమెనీ ని చంపేశారు!
ఇరాన్ ప్రజలు చనిపోయింది ఖోమెనీ ని హత్యచేయాలనే ప్లాన్ లో భాగంగా జరిగింది!
మన దేశంలో జార్జ్ సోరోస్ ప్లాన్ చేసి విఫలం అయ్యాడు!
ఇరాన్ లో ఇజ్రాయేల్ సక్సెస్ అయ్యింది!
మనం జాగ్రత్తగా ఉండాలి అంతే!
ఇరాన్ లో ఇంటిదొంగలతో పాటు సాటి ముస్లిం దేశాలు ఇజ్రాయేల్ కి సహకరించాయి!
ఎదో ఒక రోజు ఖాతార్, సౌదీ అరేబియాలకి ఇదే గతి పడుతుంది మనం చూస్తాం!
(సేకరణ)
జైహింద్!