మహిళా చైతన్యానికి 2కే వాకథాన్ ప్రారంభించిన ఏఎస్పి ఎం జావళి.
నంద్యాల (AIMA MEDIA): 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా నంద్యాల పట్టణ కేంద్రంలో SVR ఇంజనీరింగ్ కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా చైతన్యానికి ‘2కే వాకథాన్* కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించారు.ఈ సంధర్భంగా M. జావళి మాట్లాడుతూ ఆడబిడ్డల రక్షణే ప్రథమ కర్తవ్యంగా, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచేందుకు,సమాజంలో మహిళా సాధికారత, భద్రత, సమానత్వం మరియు నాయకత్వ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి వాకథాన్ కార్యాక్రమంను పద్మావతి నగర్ ఆర్చ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ASPతో పాటు SVR ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు,NCC విధ్యార్థులు,కళాశాల విధ్యార్థినులు మరియు మహిళా శక్తిని చాటిచెప్పే శక్తి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.