logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మద్యపాన నిషేధం కోసం పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేసిన సర్పంచ్ చౌలం కేశవరావు,

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మార్చి 05:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)



గ్రామ భవిష్యత్తు కోసం మద్యపానంపై కఠిన చర్యలు

*మద్యపాన నిషేధం కోసం పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేసిన సర్పంచ్ చౌలం కేశవరావు, ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,


కరకగూడెం, మార్చి 05: ఈరోజు (గురువారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించిన సర్పంచ్ చౌలం కేశవరావు, ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –గ్రామంలో పెరుగుతున్న మద్యపాన ప్రభావం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో మద్యపాన నిషేధంపై తీర్మానం చేయబడినట్లు తెలిపారు.గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయం లేదా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వారికి రూ.25,000/- జరిమానా విధించాలని తీర్మానించామని వెల్లడించారు., మద్యం అక్రమ విక్రయాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించి పట్టించేందుకు సహకరించిన వారికి ప్రోత్సాహకంగా రూ.2,000/- నగదు బహుమతి అందజేయాలని నిర్ణయించామని తెలిపారు.గ్రామంలో మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొని, యువత భవిష్యత్తు దృష్ట్యా మద్యపానాన్ని పూర్తిగా అరికట్టాలని వారు పోలీసు అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలోవార్డు మెంబర్లు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

108
4980 views

Comment