logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు ఆరోగ్య స్థితిగతులు అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలను పరిశీలించిన:ఆయోగ్ కన్సల్టెంట్ ఉమాంగ్ కటోచ్

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం ఏరియా హాస్పిటల్* 05 మార్చ్ 26*(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

మారుమూల ఏజెన్సీ గ్రామాలలో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్య స్థితిగతులు ముఖ్యంగా నవజాత శిశు మరణాలు జరగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత వైద్యాధికారులపై ఉందని నీతి ఆయోగ్ కన్సల్టెంట్ ఉమాంగ్ కటోచ్ అన్నారు

గురువారం నాడు భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో జరుగుతున్న మాతృ మరియు నవజాత శిశు సంరక్షణ సేవలు ఎలా అందిస్తున్నారో, హాస్పిటల్‌లో ఉన్న సదుపాయాల గురించి, మేటర్నిటీ వార్డ్, SNCU, NRC వంటి విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవల గురించి ఎంక్వయిరీ చేశారు.లేబర్ రూమ్ లో సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీలు) ఎలా నిర్వహిస్తున్నారో, వాటి విధాన సరళి గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ అనంతరం బేబీలకు వెయిట్ చెక్ చేయడం, అందుకు అవసరమైన పరికరాలు ఉన్నాయా లేదా అనే విషయాలను నిశితంగా పరిశీలించారు. వాటికి సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు .అలాగే SNCU లో ఉన్న నవజాత శిశువుల పరిస్థితి, వారికి అందిస్తున్న సేవలు గురించి కూడా తెలుసుకున్నారు. నవజాత శిశువుల మరణాల రేటు గురించి ప్రత్యేకంగా ఎంక్వయిరీ చేశారు. భద్రాచలం SNCU లో మరణాల రేటు తక్కువగా ఉండటం గమనించి, దానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరణాల రేటు తగ్గించడానికి హాస్పిటల్‌లో తీసుకున్న జాగ్రత్తలు మరియు చికిత్స విధానాల గురించి వివరంగా చర్చించారు. హాస్పిటల్‌లో అందిస్తున్న సేవలు, చికిత్స విధానం, నిర్వహణ విధానం చూసిన అనంతరం సిబ్బందిని వారు అభినందించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఇతర జిల్లాల కంటే ఈ జిల్లాలో ముఖ్యంగా గిరిజన గ్రామాలలో నవజాత శిశు మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, గిరిజనులకు కూడా వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. మారుమూల ప్రాంత గిరిజనులకు మరింత సేవలు అందించడానికి కావలసిన మెటీరియల్ గురించి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ అధికారి సంజీవరావు, నీతి అయోగ్ అసిస్టెంట్ కన్సల్టెంట్ నవనీత్,ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్, పర్యవేక్షకుడు రామకృష్ణ మరియు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

109
4390 views

Comment