మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్స్ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల పై అవగాహన ఎస్పీ తుషార్ డుడి
చిత్తూరు జిల్లా,పలమనేరు మదనపల్లి రోడ్డు నందుగల మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్స్ నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది యువత ఒకసారి మత్తుకు అలవాటు పడితే తమతో పాటు తమ కుటుంబం కూడా నాశనం అవుతుందని ఎస్పీ తుషార్ డుడి తెలిపారు. అంతకుమునుపు విద్యార్థులు మత్తు వినియోగం వలన కలిగే వ్యసనాలను గురించి నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులకు హెల్మెట్ వినియోగం పై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లను విద్యార్థులకు కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డుడి, ట్రైనింగ్ ఎస్పి తరుణ్ పావా, డి.ఎస్.పి డేగల ప్రభాకర్, సీ ఐ మోహన్ రెడ్డి తదితర అధికారులు, మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ రవీంద్రబాబు, కాలేజీ యజమాన్యం, బోధన సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.